ఎంపీగా జాతీయ స్థాయిలో మీరు చూపుతున్న చొరవ ప్రశంసనీయం: రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు విషెస్
- రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు
- జాతీయ స్థాయిలో రాష్ట్ర సమస్యలను చర్చకు తీసుకొస్తున్నారు
- మీరు కీర్తి, సంపదలతో వర్ధిల్లాలి
'రామ్మోహన్ నాయుడుకి పలువురు టీడీపీ నేతలు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పార్లమెంటు సభ్యుడు, సోదరుడు రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు ప్రజల గొంతుకను జాతీయస్థాయిలో బలంగా వినిపించే టీడీపీ యువ ప్రతినిధిగా... మీరు ఉజ్వలమైన ప్రజాజీవితాన్ని, సంపూర్ణ ఆయురారోగ్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.