Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే!

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో కూడా నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 57,788కి పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు పతనమై 17,221 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.59%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.06%), మారుతి సుజుకి (0.90%), ఎల్ అండ్ టీ (0.63%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), ఐటీసీ (-1.88%), టీసీఎస్ (-1.47%), టైటాన్ కంపెనీ (-1.33%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News