సిరివెన్నెల చివరి పాట ఇదేనట!
- నాని నుంచి 'శ్యామ్ సింగ రాయ్'
- సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్
- రెండు పాటలు రాసిన సిరివెన్నెల
- ఈ నెల 24న సినిమా విడుదల
అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను కొంతసేపటిక్రితం వదిలారు. నాని .. రాహుల్ సాంకృత్యన్ ఈ వీడియోలో మాట్లాడారు. ఇది సిరివెన్నెల రాసిన చివరి పాట అని చెప్పారు. నవంబర్ 4వ తేదీన ఆయన ఈ పాటను రాశారని అన్నారు. ఈ పాటలో సిరివెన్నెల అంటూ ఆయన పేరు వస్తుంది.
ఆ విషయాన్ని గురించి రాహుల్ సాంకృత్యన్ ని అడిగితే, అదే తన చివరి పాట కావొచ్చని సిరివెన్నెల అన్నారట. 'నెల రాజునీ .. ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెల' అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. 7వ తేదీన పూర్తి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.