'పుష్ప' నుంచి మరో అప్డేట్!
- ఈ నెల 17న విడుదల కానున్న 'పుష్ప'
- అదే రోజు విడుదల కానున్న హిందీ వర్షన్
- అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక మందన్న
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారాయి. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.