విజయవాడలో చెడ్డీ గ్యాంగ్.. మారణాయుధాలు, కర్రలతో హల్ చల్

Cheddy Gang Enters Vijayawada
  • గుంటుపల్లిలోని అపార్ట్ మెంట్లోకి ప్రవేశం
  • ఓ ఫ్లాట్ యజమాని లైట్లు వేయడంతో పరార్
  • స్థానికుల్లో భయాందోళన
  • ముఠా కోసం పోలీసుల గాలింపు
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. నగర శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్ మెంట్ లోకి ఐదుగురు దొంగల ముఠా ప్రవేశించింది. కర్రలు, మారణాయుధాలతో హల్ చల్ చేసింది. అయితే, అపార్ట్ మెంట్ లో అలికిడి కావడంతో ఓ ఫ్లాట్ యజమాని వెంటనే లైట్లు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల కదలికలు ఆ అపార్ట్ మెంట్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

చెడ్డీగ్యాంగ్ కదలికలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ముఠానే విజయవాడలోనూ హల్ చల్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Cheddy Gang
Crime News

More Telugu News