కార్తిక దీపాలు వదులుతూ కాల్వలో పడి దంపతుల మృత్యువాత
- కార్తిక దీపాలు వదులుతూ ప్రమాదవశాత్తు కాల్వలో పడిన భార్య
- ఆమెను రక్షించే క్రమంలో కాల్వలోకి దూకిన భర్త
- నాలుగు కిలోమీటర్ల దూరంలో మృతదేహాల లభ్యం
పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు.