చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్‌ఖాన్.. అతిథి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ సూపర్ స్టార్!
Add ap7am to your home Screen

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్‌ఖాన్.. అతిథి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ సూపర్ స్టార్!

Bollywood Hero Salman Khan in Megastar Chiranjeevis God Father
  • ‘లూసిఫర్‌’ లో పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన  పాత్రలో సల్మాన్!
  • అధికారికంగా చెప్పని ‘గాడ్ ఫాదర్’ చిత్ర బృందం
  • సల్మాన్ కనిపించేది పాటలోనా, పాత్రలోనా? అన్న అనుమానంలో చిరు అభిమానులు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళ మాతృక ‘లూసిఫర్’లో  పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన అతిథి పాత్రనే తెలుగులో సల్మాన్‌ పోషిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

మోహన్‌లాల్‌కు అండగా ఉండే ఈ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాలో అది చాలా కీలకం. అంతేకాదు, ఆ పాత్రకు ఒక పాట కూడా ఉంటుంది. ఈ పాత్ర కోసం ‘గాడ్ ఫాదర్’ బృందం సల్మాన్‌ను సంప్రదిస్తే ఆయన ఓకే చెప్పారట. అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో సల్మాన్ అతిథిపాత్రలో కనిపిస్తారా? లేక, ఏదైనా పాటలో తళుక్కుమంటారా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
Bollywood
Tollywood
Chiranjeevi
Salman Khan
God Father

More Telugu News