పిల్ల‌ల్ని ఎందుకు క‌న‌లేద‌న్న ప్ర‌శ్న‌కు ఉపాస‌న ఘాటుగా స‌మాధానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్ల‌ల్ని ఎందుకు క‌న‌లేద‌న్న ప్ర‌శ్న‌కు ఉపాస‌న ఘాటుగా స‌మాధానం

it will be sensational says upasana
  • పిల్ల‌ల్ని ఎప్పుడు క‌నాలన్నది  నా వ్య‌క్తిగ‌త విష‌యం
  • నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను
  • సామాజిక మాధ్య‌మాల్లోనూ చ‌ర్చించుకుంటున్నారు
  • నేను మాట్లాడితే ఏదేదో రాసేస్తుంటారు
సినీ హీరో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తుల‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహ‌ం జ‌రిగింది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు పిల్ల‌ల‌ను ఎందుకు క‌న‌లేద‌న్న ప్ర‌శ్న అభిమానుల్లో ఉంది. దీనిపై ఉపాస‌న స్పందించారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...  పిల్ల‌ల్ని ఎప్పుడు క‌నాలన్నది త‌న వ్య‌క్తిగ‌త విష‌మ‌య‌ని చెప్పారు. ఈ విషయంలో త‌నకంటూ కొన్ని హద్దులు గీసుకున్నానని ఆమె అన్నారు. అయితే పిల్లల విష‌యంలో సామాజిక మాధ్య‌మాల్లోనూ కొందరు దీనిపై చ‌ర్చించుకుంటార‌ని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అలాంటి వారికి  సమాధానం చెప్పాల్సిన అవసరం త‌నకు లేదని, దీనిపై తాను ఏం మాట్లాడినా అది మీడియాలో సంచ‌ల‌నం అవుతుంద‌ని, ఏదేదో రాసేస్తుంటార‌ని ఉపాసన వ్యాఖ్యానించారు. అయితే, ఎవ‌రేమైనా అనుకోనివచ్చని, తాను మాత్రం దీనికి సమాధానం చెప్పనని ఆమె స్ప‌ష్టం చేశారు. దీనిపై ఎవ‌రు ఏమనుకున్నా త‌నకు అభ్యంతరం లేదని అన్నారామె. అయితే, సమయం వచ్చినప్పుడు మాత్రం శుభ‌వార్త అందరికీ చెబుతానని నవ్వుతూ చెప్పారు.                  

                    
upasana
Ramcharan
Tollywood

More Telugu News