Sensex: ద్రవ్యోల్బణం భయాలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీని ప్రభావం మెటల్స్, బ్యాంక్ స్టాక్స్ పై పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 60,352కి పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 18,017 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.00%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.16%), సన్ ఫార్మా (1.14%), ఐటీసీ (0.90%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.38%), టాటా స్టీల్ (-2.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.23%), ఏసియన్ పెయింట్స్ (-1.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.13%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News