తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలి: చంద్రబాబు
- రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
- అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు
- అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించలేదంటూ ఆగ్రహం
- ఓ అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ
విపక్ష నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారని తెలిపారు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని, దినేశ్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.