Tirupati: భార్య చెల్లెలితో ప్రేమాయాణం.. మరదలకు జ్ఞానోదయం, బావ ఆత్మహత్య

Man suicide tirupati lodge
  • భార్యతో ఏడాదికాలంగా గొడవలు
  • గర్భంతో ఉన్న భార్యను వదిలిపెట్టి మరదలితో తిరుపతికి
  • లాడ్జిలో ఆమె ఆత్మహత్యాయత్నం
  • ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బావ
గర్భవతి అయిన భార్యను వదిలిపెట్టి మరదలిని లాడ్జీకి తీసుకెళ్లాడో వ్యక్తి. అక్కడ ఆమెకు జ్ఞానోదయం అయింది. అక్కకు అన్యాయం చేయలేనని చెబుతూ బుధవారం రాత్రి ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించగా, అతడు అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 తిరుపతి పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయి నవీన్ (26) నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లి జేఎన్‌టీయూకి చెందిన మహిళను పెళ్లాడాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. కాగా, నవీన్ దంపతుల మధ్య ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భార్య చెల్లెలి (మరదలు)తో నవీన్ ప్రేమ మొదలుపెట్టాడు. విషయం తెలిసిన భార్య తమ కుటుంబ సభ్యుల సొంతూరైన గుడివాడకు వెళ్లింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానని నవీన్ బెదిరించడంతో అందరూ కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు, మరదలితో కలిసి మూడు రోజుల క్రితం నవీన్ తిరుపతి వెళ్లాడు. స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే, అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు, సాయి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆమెకు మెలకువ రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tirupati
Hyderabad
Cricket
Suicide

More Telugu News