బైక్ పై భారత్-పాకిస్థాన్ బోర్డర్ వరకు వెళ్లిన హీరో అజిత్... ఫొటోలు ఇవిగో!

Hero Ajith goes to India Pakistan border
  • ఉత్తర భారతదేశంలో అజిత్ బైక్ ట్రిప్
  • క్రూయిజర్ బైక్ పై లాంగ్ రైడ్
  • వాఘా వద్ద అజిత్ సందడి
  • వాలిమై చిత్రంలోనూ బైక్ రేసర్ గా నటించిన అజిత్
తమిళ హీరో అజిత్ మంచి బైక్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. షూటింగ్ విరామ సమయాల్లో ఆయన బైక్ పై లాంగ్ రైడ్ కు వెళుతుంటారు. తాజాగా తన క్రూయిజర్ బైక్ పై ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లారు. అజిత్ వాఘా వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వరకు బైక్ పై వెళ్లడం విశేషం. బోర్డర్ గేట్ వద్ద త్రివర్ణ పతాకం చేతబూని ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ సందర్భంగా భారత జవాన్లు అజిత్ తో సెల్ఫీలకు ఉత్సాహం చూపించారు. అజిత్ అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు.  అజిత్ బైక్ ట్రిఫ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ నటించిన వాలిమై చిత్రంలో బైక్ రైడింగ్ ఎపిసోడ్ ఉంది. ఇందులో అజిత్ రేసర్ గా నటించారు.
Go Back to Shorts
Ajith
Bike Ride
India-Pakistan Border
Wagha
North India Trip

More Telugu News