టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని... చంద్రబాబు దీక్షకు మద్దతు
- కొంతకాలంగా పార్టీకి నాని దూరం
- ఇటీవల తన ఆఫీసులో చంద్రబాబు ఫొటో తొలగింపు
- పార్టీ మారతారంటూ ప్రచారం
ఇటీవల కేశినేని నాని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకుల తీరుతో అసంతృప్తికి గురై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదన్న తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికల వేళ బొండా ఉమ, బుద్ధా వెంకన్నలతో కేశినేని నానికి విభేదాలు తెలిసిందే.