mishra: ఎట్ట‌కేల‌కు లఖింపూర్ హింస ఘ‌ట‌న‌లో విచార‌ణ‌కు హాజ‌రైన కేంద్ర మంత్రి కుమారుడు.. వీడియో ఇదిగో

 Mishra arrives at Crime Branch office
షార్ట్స్‌లో చూడండి
యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర స‌హాయ‌ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్ట‌కేల‌కు ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయన పోలీసుల విచారణకు నిన్న గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా విచార‌ణ‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సిట్ అధికారులు హెచ్చ‌రించారు. దీంతో ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నను మీడియా ప‌లు ప్రశ్న‌లు అడ‌గ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా మాట్లాడ‌కుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్‌ లోప‌లికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, యూపీలోని లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఎవ‌రినీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు.
Go Back to Shorts
mishra
Uttar Pradesh

More Telugu News