ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ

Andhra Pradesh Leads in Digitizing Health Records NIC
  • ఈ-హాస్పిటల్ అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం
  • జాతీయ స్థాయిలో ఎన్ఐసీ ఉన్నతాధికారుల ప్రశంసలు
  • విజయవాడ, గుంటూరులో స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రాజెక్టులు
రోగుల ఆరోగ్య వివరాల డిజిటలీకరణ (ఈ-హాస్పిటల్) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా జారీ అవుతున్న ఈ-ప్రిస్క్రిప్షన్లలో 70 శాతం, ల్యాబ్ టెస్టుల రికార్డులలో 72 శాతం ఏపీ నుంచే నమోదవుతున్నాయని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ఉన్నతాధికారులు ప్రశంసించారు.

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, ఎన్ఐసీ సంయుక్తంగా "నెక్స్ట్‌జెన్ ఈ-హాస్పిటల్" విధానంపై రెండు రోజుల వర్క్‌ షాప్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి.జె. ఆంటోనీ, డివిజన్ హెడ్ రవీంద్ర కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ-హాస్పిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానమైన 4,003 ప్రభుత్వ ఆసుపత్రులలో 281 ఏపీలోనే ఉన్నాయని తెలిపారు.

ఈ డిజిటల్ విధానం వల్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) నంబర్ ఉన్న రోగులు దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా సులభంగా చికిత్స పొందవచ్చని అధికారులు వివరించారు. ఓపీడీ, ఐపీడీ, ల్యాబ్, రేడియాలజీ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఏపీ ముందుందని పేర్కొన్నారు.

ఈ విధానం వల్ల వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ప్రస్తుతం గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల పనిభారాన్ని తగ్గించేందుకు స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రోగ్రాం అమలవుతోందని, నర్సీపట్నంలో ఆటోమేటెడ్ ల్యాబ్ ఫలితాలు నేరుగా రోగి మొబైల్‌కే వెళ్తున్నాయని ఆయన వివరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
e-Hospital
digital health records
National Informatics Centre
NIC
e-prescription
ABHA
Ayushman Bharat Health Account
healthcare digitization
Saurabh Gaur

More Telugu News