Samantha: మ‌రోసారి భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసిన హీరోయిన్ స‌మంత‌!

Actress Samantha emotional post about society goes viral
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మ‌రోసారి భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసింది. 'మ‌హిళ‌లు ఏదైనా చేస్తే ఈ స‌మాజం ఎల్ల‌ప్పుడూ నైతిక‌తతో కూడిన ప్ర‌శ్న‌లు వేస్తుంటుంది. అదే ప‌ని మ‌గ‌వాళ్లు చేస్తే మాత్రం ప్ర‌శ్నించ‌దు. స‌మాజంలోని మ‌నుషులుగా మ‌న‌కు ప్రాథ‌మికంగా నైతిక‌త లేన‌ట్టే' అనే ఆంగ్ల కొటేషన్ ను ఆమె పోస్ట్ చేసింది.  

ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో చాలా అరుదుగా స‌మంత పోస్టులు చేస్తోంది. ఆమె ఏ పోస్ట్ చేసినా అమితాస‌క్తి క‌లిగిస్తోంది. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోయిన నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో ఈ అంశంపైనే విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.

వారు విడిపోవ‌డానికి స‌మంత తీరే కార‌ణ‌మంటూ అనేక మంది అనేక ర‌కాలుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సమంత పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజ‌న్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంతేగాక‌, స‌మంత‌పై అనేక ర‌కాలుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

  
Go Back to Shorts
Samantha
Tollywood

More Telugu News