'సర్కారువారి పాట' కోసం మహేశ్ పారితోషికం 50 కోట్లు?
- షూటింగు దశలో 'సర్కారువారి పాట'
- డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు
- బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ
- జనవరి 13వ తేదీన విడుదల
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు మహేశ్ బాబు అందుకుంటున్న పారితోషికం 50 కోట్లకు చేరిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల కేటగిరిలో కనిపిస్తున్న వాళ్లంతా ఇంచుమించు ఇదే స్థాయి పారితోషికాన్ని తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
ఈ కథ అంతా కూడా భారీ స్థాయిలో జరిగిన ఒక బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు కనిపిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' పండుగ సందర్భంగా, జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.