Khairatabad: ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. నగరంలో భక్తుల కోలాహలం

Khairatabad Ganesha procession started
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఇక, నగరంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపైకి గణేశుడిని చేర్చిన నిర్వాహకులు తెల్లవారుజామునే అవసరమైన వెల్డింగ్ పనులను పూర్తిచేసి శోభాయాత్రకు సిద్ధం చేశారు. మరోవైపు, వినాయకుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మొత్తం 17 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.  

హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు కూడా ఈ ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం బాలాపూర్ చౌరస్తాలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. కాగా, నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులకు జీహెచ్ఎంసీ మాస్కులు పంపిణీ చేస్తోంది.
Go Back to Shorts
Khairatabad
Maha Ganapathi
Hyderabad

More Telugu News