తెలంగాణలో మరో 259 మందికి కరోనా పాజిటివ్

Telangana corona report
  • గత 24 గంటల్లో 58,261 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,282 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 58,261 కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 259 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,62,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,282 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,900కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
New Cases

More Telugu News