యాంకర్ శ్రీముఖి అమ్మమ్మ మృతి.. భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టు!

Anchor Sreemukhis grand mother dead
  • అమ్మమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న శ్రీముఖి
  • నీతో డ్యాన్స్ చేయడాన్ని మిస్ అవుతున్నా
  • నేను విన్న బెస్ట్ లవ్ స్టోరీలలో నీది, తాతయ్యది ఒకటి
  • 'మీ ఇద్దరి లవ్ స్టోరీ మళ్లీ కొనసాగుతుంది' అంటూ  భావోద్వేగం
ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి పంచుకుంది. తన అమ్మమ్మ గురించి ఆమె భావోద్వేగంతో కూడిన మెసేజ్ పోస్ట్ చేసింది.

'అమ్మమ్మా... నా జీవితంలో ఎన్నో విషయాల గురించి నాకు నేర్పించావు. నీవు ఎప్పుడూ సంతోషాన్ని పంచావు. నీతో డ్యాన్స్ చేయడాన్ని మిస్ అవుతున్నా. నీతో కలిసి పాటలు పాడటాన్ని మిస్ అవుతున్నా. నీవంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో నేను విన్న బెస్ట్ లవ్ స్టోరీలలో నీది, తాతయ్యది ఒకటి. నీవు కచ్చితంగా తాతయ్యను కలుసుకుంటావు. మీ ఇద్దరి లవ్ స్టోరీ మళ్లీ కొనసాగుతుంది' అంటూ ఆమె ఎమోషన్ అయింది.

శ్రీముఖి సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజా చిత్రం 'క్రేజీ అంకుల్స్' ఇటీవల విడుదల అయింది. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Go Back to Shorts
Anchor
toll
Grand Mother
Dead
Sreemukhi

More Telugu News