సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రభాస్ తో మళ్లీ చేస్తానంటున్న కంగన
- రవితేజ తదుపరి సినిమా అప్ డేట్
- మరో హిందీ సినిమాలో రానా దగ్గుబాటి
* ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చిత్రాన్ని చేస్తున్న హీరో రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం షూటింగును అక్టోబర్ 1 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
* షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీకుమార్ దర్శకత్వంలో తాజాగా ఓ హిందీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.