తెలంగాణలో తాజాగా 298 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 68,097 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,476 మందికి చికిత్స
అదే సమయంలో 325 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,778 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,476 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,888కి పెరిగింది.
