ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైరా బాను
- శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డ సైరా బాను
- గత నెల 28న ఆసుపత్రిలో చేరిక
- ఈ జులైలో ఆమె భర్త దిలీప్ కుమార్ మృతి
ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత సైరా బానును వైద్యులు ఐసీయూకి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ సతీమణే సైరా బాను అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో 98 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందమైన జంటగా వీరు గుర్తింపును తెచ్చుకున్నారు.