మరోసారి హాలీవుడ్ సినిమాలో దీపిక.. ఈసారి నిర్మాతగా కూడా!

Deepika Padukone stars in another Hollywood flick
షార్ట్స్‌లో చూడండి
మన బాలీవుడ్ భామలు అవకాశం దొరికితే హాలీవుడ్ సినిమాలు చేయడానికి కూడా ఉత్సాహం చూపుతుంటారు. ఆ విధంగా ఇప్పటికే ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో విజయవంతంగా కొనసాగుతోంది. మరోపక్క, చేతినిండా ప్రాజక్టులతో బాలీవుడ్ లో బిజీగా వున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే ఆమధ్య 'రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' అనే సినిమాలో నటించి హాలీవుడ్ ప్రవేశం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధపడుతోంది.
 
రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ చిత్రాన్ని ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో విశేషం ఏమిటంటే, కథానాయిక దీపిక ఇందులో నటించడమే కాకుండా, తాను కూడా ఓ నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటోంది.

ఈ విషయాన్ని ఈ రోజు ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ చైర్మన్ ఆడమ్ ఫోజిల్సన్ మీడియాకు వెల్లడించారు. 'దీపిక ఎంతో ప్రతిభావంతురాలైన ఆర్టిస్టు అనీ, అంతర్జాతీయ స్థాయి సూపర్ స్టార్ గా ఎదుగుతోందనీ ఆయన కొనియాడారు. ఎన్నో ప్రణయకథా చిత్రాలలో నటించి, సక్సెస్ అయిన దీపికతో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేయడానికి థ్రిల్ ఫీలవుతున్నామని అన్నారాయన. ఈ సినిమాలో నటిస్తున్నందుకు, ఎస్టీఎక్స్ ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ తో తన చిత్ర నిర్మాణ సంస్థ 'కా ప్రొడక్షన్స్' భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పింది దీపిక.
Go Back to Shorts
Deepika Padukone
Bollywood
Hollywood
Priyanka Chopra

More Telugu News