హెడ్డింగ్ లో పొరపాటు జరిగింది.. విశాఖ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ
- లోక్ సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం
- ఏపీ రాజధానిగా వైజాగ్ ను పేర్కొన్న వైనం
- పొరపాటు జరిగిందని కేంద్రం వివరణ
లిఖితపూర్వక సమాధానంలో టేబుల్ కు సంబంధించిన హెడ్డింగ్ లో పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం చెప్పింది. హెడ్డింగ్ లో క్యాపిటల్ తో పాటు, సమాచారం సేకరించిన నగరం పేరును కూడా చేర్చుతున్నామని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే లోక్ సభ సచివాలయానికి సమాచారం కూడా ఇచ్చామని చెప్పింది. కేంద్రం ఇచ్చిన క్లారిటీతో వివాదం సద్దుమణిగింది.