Kalyandev: 'కిన్నెరసాని' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్!

  • మిస్టరీ థ్రిల్లర్ గా 'కిన్నెరసాని'
  • కొత్త లుక్ తో కల్యాణ్ దేవ్ 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    
Kinnerasani teaser released

కల్యాణ్ దేవ్ హీరోగా 'కిన్నెరసాని' సినిమాను దర్శకుడు రమణతేజ రూపొందించాడు. రజనీ తాళ్లూరి - రవి చింతల నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది.

అద్భుతం జరిగే ప్రతి చోటా ఆపద ఉంటుంది.. ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలి .. అది ద్వేషానికైనా, చివరికి ప్రేమకైనా అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో వచ్చిన చిత్రాలలో కంటే భిన్నంగా ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ద్వారా కొత్త కథానాయిక పరిచయం కానుంది.

More Telugu News