నేనిచ్చిన డెడ్ లైన్ కి ఇంకా 19 రోజులే మిగిలుంది: లోకేశ్
- గుంటూరులో రమ్య అనే విద్యార్థిని హత్య
- 21 రోజుల్లో శిక్ష పడాలన్న లోకేశ్
- దిశ చట్టం ప్రస్తావన
- సోదరి రమ్యకు న్యాయం జరగాలని వ్యాఖ్యలు
సోదరి రమ్యకు న్యాయం జరగాలని, దిశ చట్టం ద్వారా హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడాలని లోకేశ్ స్పష్టం చేశారు. నిన్న లోకేశ్ పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే ఆ మరుసటి రోజు నుంచే తమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.