Perni Nani: ఐశ్వర్యం కంటే జగన్ గుండెల్లో స్థానమే గొప్పది: పేర్ని నాని
ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి పేర్ని నాని మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. ఐశ్వర్యం కంటే జగన్ గారి గుండెల్లో స్థానమే తనకు చాలా గొప్పదని ఆయన అన్నారు. తనను నమ్ముకున్న వారిని జగన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరని చెప్పారు. అందరూ బాగుండాలనేది ఆయన తత్వమని అన్నారు. తాను మంత్రినవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. జగన్ సంక్షేమ పాలనలో తాను కూడా భాగస్వామిని కావడం గర్వంగా ఉందని అన్నారు.