హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం.. ప్రారంభించిన కేటీఆర్
- నగరంలోని మూడువేల రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్ వై-ఫై సౌకర్యం
- యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు
- వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో కేటీఆర్ వీడియో కాల్
ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు. తానన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వై-ఫై అని పేర్కొన్నారు. బాల మల్లాది మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వై-ఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు చెప్పారు.