కేసీఆర్ నీచ సంస్కృతికి ఇది నిదర్శనం: ఈటల రాజేందర్
- టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోంది
- పాదయాత్రకు అనుమతులు తీసుకున్నా అడ్డంకులు సృష్టిస్తున్నారు
- భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారు
టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని ఈటల మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఇలాంటి ఘటనలు నిదర్శనాలని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు, అహంకారపు పాలనకు ఈ పాదయాత్ర నుంచే చరమగీతం పాడుతామని అన్నారు.