అట్లీ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లవ్ స్టోరీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అట్లీ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లవ్ స్టోరీ!

Ntr latest movie with Atlee Kumar
  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • నెక్స్ట్ సినిమా కొరటాల శివతో
  • లైన్లో అట్లీ కుమార్
  • స్క్రిప్ట్ పై సాగుతున్న కసరత్తు  
ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ఎక్కువ .. అందువలన ఆయన మాస్ ఆడియన్స్ కి నచ్చిన అంశాలను తన కథల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా యాక్షన్ .. ఎమోషన్ ఉన్న కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. కథాకథనాలు ఏవైనా తన సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలు ఎలాంటి పరిస్థితుల్లోను మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ సారి లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అట్లీ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అది ప్రేమకథ నేపథ్యంలో సాగే కథ అనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పై అట్లీ కుమార్ కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ చేయనున్న ఈ ప్రేమకథలోని కొత్త కోణం ఏమిటో చూడాలి.
Junior NTR
Atlee Kumar
Koratala Siva

More Telugu News