తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు
- ఏపీ పరిసర ప్రాంతాల్లో వ్యాపించిన ఉపరితల ద్రోణి
- టీఎస్ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయన్న వాతావరణ కేంద్రం
రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుకుగానే ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల కారణంగా ఈ నెలలో పూర్తి స్థాయి వర్షపాతం నమోదు కానుందని చెప్పింది. సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. నిన్న కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా దాదాపు అన్ని రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతోంది.