దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే: సినీ నటుడు సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే: సినీ నటుడు సుమన్

All Indians are local says Suman
  • మా ఎన్నికల్లో తెరపైకి నాన్ లోకల్ అంశం
  • ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటున్న ప్రత్యర్థులు
  • రైతులు నాన్ లోకల్ అనుకుంటే ఆహారం కూడా దొరకదన్న సుమన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడిని రాజేస్తున్నాయి. తమ ప్రత్యర్థులపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు తీవ్ర విమర్శలు గుప్పించడానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలబడుతున్న ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం పెద్ద చర్చకే దారి తీసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు సుమన్ స్పందిస్తూ... దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలేనని చెప్పారు. వైద్యులు, రైతులు కూడా నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం కూడా అందదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ప్రకాశ్ రాజ్ కు మద్దతును ప్రకటించారు.

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఈ సందర్భంగానే మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు. అందరూ కలసికట్టుగా ఉండాలని... లోకల్, నాన్ లోకల్ అనే భావన వద్దని సూచించారు.
Suman
Tollywood
Non Local
MAA Elections

More Telugu News