తెలంగాణకు వర్ష సూచన
- బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
- రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే... ఈరోజు నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.