కర్నూలు జిల్లాలో మహిళా కూలీకి వజ్రం.. రూ. 6 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారి
- టమాటా నారు నాటుతుండగా దొరికిన వజ్రం
- కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారి
- ఇటీవల ఓ రైతుకు దొరికిన రూ. 1.25 కోట్ల విలువైన వజ్రం
టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి చిక్కిన ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరిలో ఇటీవల ఓ రైతుకు దొరికిన వజ్రం రూ. 1.25 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు స్థానికులే ఆ పని చేస్తున్నారు.