డూప్ లేకుండా రిస్క్ తీసుకున్న విశాల్... తప్పిన ప్రమాదం!
- హైదరాబాదులో విశాల్ 31 షూటింగ్
- విశాల్ తలకు తగిలిన సీసా
- ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్
- టైమింగ్ తప్పిందన్న విశాల్
దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ... కొద్దిలో తప్పించుకున్నానని వెల్లడించారు. ఆ ఫైటర్ తప్పేమీలేదని తెలిపారు. కొంచెం టైమింగ్ తప్పిందని, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని పేర్కొన్నారు. భగవంతుడి నిర్ణయం, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని విశాల్ వెల్లడించారు. కాగా, విశాల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.