కొత్త ప్రాజెక్టులో వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఛాన్స్!
- తమిళనాట విపరీతమైన క్రేజ్
- లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్
- బాలకృష్ణ సినిమాలోను అవకాశం
తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' .. 'నాంది' సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 'క్రాక్' సినిమాలో విలన్ గా ఆమె ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించనున్న సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే 'హనుమాన్' సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, హీరోగా తేజ సజ్జ నటించనున్న సంగతి తెలిసిందే.