రాష్ట్రపతి రేసులో శరద్ పవార్.. పీకేతో భేటీలో చర్చించింది ఇదేనా?
- రెండు రోజుల క్రితం శరద్ పవార్‌తో పీకే భేటీ
- రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన
- మరాఠా రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ
మరోవైపు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక బీజేపీకే బలం ఎక్కువగా ఉంది. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు శరద్ పవార్ అంగీకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆయన నిత్యం ప్రజల్లో ఉండడానికే ఇష్టపడతారని, అలాంటిది రాష్ట్రపతి భవన్‌కు పరిమితం కావడానికి ఆయన అంగీకరించకపోవచ్చని కూడా చెబుతున్నారు. రాష్ట్రపతి పోటీ విషయంలో బయట పలు వార్తలు షికార్లు చేస్తున్నా ఎన్సీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.