మ్యాథ్యూస్‌ తనకు సన్నిహితుడు అంటోన్న హీరోయిన్ తాప్సీ!
Add ap7am to your home Screen

మ్యాథ్యూస్‌ తనకు సన్నిహితుడు అంటోన్న హీరోయిన్ తాప్సీ!

tapsee gives clarity on her marriage
  • డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో ప్రేమ‌?
  • మ‌నం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలన్న హీరోయిన్
  • మ్యాథ్యూస్ త‌నకు బాగా తెలిసిన వ్యక్తి అని వ్యాఖ్య‌
  • సినిమా అవ‌కాశాలు త‌గ్గిన‌ప్పుడు పెళ్లి చేసుకుంటాన‌న్న తాప్సీ
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో హీరోయిన్ తాప్సీ ప్రేమ‌లో ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేగాక‌, త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై తాప్సీ తాజాగా స్పందిస్తూ.. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే అవ‌కాశం లేద‌ని చెప్పింది.

అలాగే, సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టంలేదని తెలిపింది. మ‌నం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ఇక మ్యాథ్యూస్ గురించి చెబుతూ, అతను త‌నకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు అని చెప్పింది. తాను సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్నాన‌ని తెలిపింది. ఏడాదికి ఆరు సినిమాల్లో నటిస్తున్నానని, ఆ సంఖ్య రెండు లేక‌ మూడుకు తగ్గినపుడే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
taapsee
Tollywood
Bollywood

More Telugu News