బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న భారత భద్రతా బలగాలు
- అనుమానాస్పదంగా చైనా వ్యక్తి
- పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో పట్టుబడిన వైనం
- కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చిన జవాన్లు
- చైనీయుడ్ని ప్రశ్నిస్తున్న భద్రతా సంస్థలు
సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడిని కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చి, ఇతర భద్రతా సంస్థలకు సమాచారం అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చైనా జాతీయుడిని ఇతర భద్రతా సంస్థల అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.