Sridivya: విజయవాడలో సెల్ ఫోన్ షాపు యజమానికి టోకరా వేసిన మాయలేడి!

Woman cheats mobile shop owner in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో ఓ యువతి కన్సల్టెంట్ పేరుతో రూ.80 లక్షల మేర మోసగించిన వైనం వెల్లడైంది. శ్రీదివ్య అనే యువతి ఈ ఛీటింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. తనకు రూ.1.5 కోట్ల విలువ చేసే పొలం ఉందని శివకృష్ణ అనే సెల్ ఫోన్ దుకాణం యజమానితో చెప్పిన శ్రీదివ్య... ఆ పొలం రూ.80 లక్షలకు తాకట్టులో ఉందని అతడిని నమ్మించింది. తనను తాను ఓ కన్సల్టెంట్ గా పరిచయం చేసుకుంది.

తాకట్టు నుంచి విడిపిస్తే పొలాన్ని అధిక లాభాలకు విక్రయించవచ్చని ఆ సెల్ ఫోన్ దుకాణదారును ప్రలోభానికి గురిచేసింది. తన పొలాన్ని తాకట్టు నుంచి విడిపించమని కోరింది. ఈ క్రమంలో శివకృష్ణ పలు విడతలుగా శ్రీదివ్యకు రూ.80 లక్షలు ఇచ్చాడు. అయితే ఆమె పొలం అమ్మకంపై ఎంతకీ స్పందించకపోవడంతో తాను మోసపోయానని శివకృష్ణ గ్రహించాడు. శ్రీదివ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీసులు శ్రీదివ్యపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా, శ్రీదివ్య ప్రేమ, పెళ్లి పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Sridivya
Cheating
Cell Phone Shop Owner
Police
Vijayawada

More Telugu News