దేశంలో డిమాండ్ ను మించిపోయిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి

Remdesivir production beats demand in country
  • కొన్నిరోజల కిందట రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత
  • ఉత్పత్తిని పదింతలు పెంచిన కేంద్రం
  • ఉత్పత్తి కేంద్రాల సంఖ్య 20 నుంచి 60కి పెంపు 
  • ప్రస్తుతం కేంద్రం వద్ద 50 లక్షల ఇంజెక్షన్లు
నిన్నమొన్నటి దాకా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కీలక ఇంజెక్షన్ కు ఏర్పడిన అధిక డిమాండే అందుకు కారణం. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదని కేంద్రం చెబుతోంది. దేశంలో డిమాండ్ ను మించిపోయేలా రెమ్ డెసివిర్ ఉత్పత్తి జరుగుతోంది. దీనిపై కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవ్య వివరణ ఇచ్చారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11 నాటికి దేశంలో రోజుకు 33 వేల రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేయగా, ఇప్పుడది పదింతలు పెరిగి రోజుకు 3.5 లక్షల ఇంజెక్షన్లు తయారుచేసే స్థాయికి చేరిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక్క నెలలోనే రెమ్ డెసివిర్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్యను 20 నుంచి 60కి పెంచిందని తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ కంటే లభ్యత ఎక్కువగా ఉన్నందున రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులను కేంద్రం నిలిపివేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై దేశంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యత, ఇతర అంశాలను జాతీయ ఫార్మా ధరల నియంత్రణ సంస్థ, సీడీఎస్ సీఓ పర్యవేక్షించాలని నిర్దేశించారు.

కాగా, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి అంచనాలకు మించి జరుగుతుండడంతో కేంద్రం తన వద్ద 50 లక్షల వయల్స్ ను నిల్వ ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిల్వలను అత్యవసర సమయాల్లో వినియోగించనున్నారు.
Go Back to Shorts
Remdesivir
Demand
Production
India

More Telugu News