గ‌త ఏడాది భార‌త్ మాకు చేసిన సాయం మరువ‌లేనిది: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ

29-05-2021 Sat 09:58 | International
  • అమెరికాలో ప‌ర్య‌టిస్తోన్న జైశంక‌ర్
  • ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీతో భేటీ
  • క‌రోనా విజృంభ‌ణ వేళ‌ భార‌త్ సాయం చేసింద‌న్న ఆంటోనీ
  • ఇప్పుడు తాము సాయం చేస్తున్నామ‌ని వ్యాఖ్య‌
అమెరికాలో క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్ ప‌లు ఔష‌ధాల‌ను పంపి సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని అమెరికా త‌రుచూ గుర్తు చేసుకుంటోంది. భార‌త విదేశాంగ శాఖ జైశంక‌ర్ ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.  

ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. త‌మ దేశంలో గ‌త ఏడాది క‌రోనా విప‌రీతంగా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో భార‌త్ సాయం చేసింద‌ని, ఆ సాయాన్ని తాము ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని తెలిపారు. ఇప్పుడు భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో తాము అండ‌గా ఉన్నామ‌ని చెప్పారు.

కాగా, ఈ సంద‌ర్భంగా జై శంక‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ...ఇరు దేశాల మ‌ధ్య అనేక అంశాల్లో చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉంద‌ని చెప్పారు. భార‌త్-అమెరికా  బంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు భావిస్తున్నాన‌ని తెలిపారు. ఈ బంధం ఇలాగే కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా వేళ అమెరికా ఇచ్చిన మ‌ద్ద‌తు, అందించిన సాయానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న‌ట్లు వివరించారు.
USAIndiajai shankar

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more