'బిచ్చగాడు' హీరో నుంచి యాక్షన్ థ్రిల్లర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిచ్చగాడు' హీరో నుంచి యాక్షన్ థ్రిల్లర్!

Vijay Antony upcoming movie update
  • విజయ్ ఆంటోని నుంచి యాక్షన్ థ్రిల్లర్
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్
  • ముఖ్యమైన పాత్రలో అక్షర హాసన్
  • తెలుగులోను ప్రేక్షకుల ముందుకు
విజయ్ ఆంటోని ... పేరు వినగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తుకు వస్తుంది. ఒక శ్రీమంతుడు తన తల్లి ప్రాణాలను నిలబెట్టడం కోసం 'బిచ్చగాడు'గా మారడమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలోని ఎమోషన్ ప్రేక్షకులకు ఒక రేంజ్ లో కనెక్ట్ కావడంతో, వసూళ్ల వర్షం కురిసేసింది. ఆ తరువాత విజయ్ ఆంటోని సినిమాలు వరుసగా తెలుగులో విడుదలయ్యాయి. 'బిచ్చగాడు' స్థాయిలో అవి విజయవంతం కాకపోయినా, వైవిధ్యభరితమైన కథలుగా ప్రశంసలు అందుకున్నాయి. ఆయన సినిమాల్లో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం అభిమానులకు ఏర్పడింది.

అలాంటి విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'అగ్ని సిరగుగల్' రూపొందుతోంది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్  థ్రిల్లర్, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయట. విజయ్ ఆంటోని గత చిత్రాల మాదిరిగానే, తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అరుణ్ విజయ్ .. ప్ర్రకాశ్ రాజ్ .. అక్షర హాసన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.
Vijay Antony
Arun Vijay
Akshara Haasan

More Telugu News