Perni Nani: టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి మరో డ్రామా కంపెనీ వచ్చిందనుకుంటున్నారు: మంత్రి పేర్ని నాని వ్యంగ్యం

Perni Nani comments on TDP mac assembly
  • ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన టీడీపీ
  • నేడు, రేపు మాక్ అసెంబ్లీ
  • మహానటులు కనిపించారంటూ పేర్ని నాని వ్యంగ్యం 
  • సురభి డ్రామా కంపెనీని గుర్తుచేసిందని ఎద్దేవా
ఇవాళ్టి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ... నేడు, రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మాక్ అసెంబ్లీలో మహానటులు కనిపించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీడీపీ మాక్ అసెంబ్లీ సురభి డ్రామా కంపెనీని గుర్తు చేసిందని, వీళ్ల మాక్ అసెంబ్లీని చూసి మరో డ్రామా కంపెనీ వచ్చిందనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

గ్లోబల్ టెండర్లలో తప్పులుంటే వ్యాక్సిన్ కంపెనీలు చెప్పాలి గానీ... చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకేమైనా వాటాలున్నాయా? అని ప్రశ్నించారు.

More Telugu News

Perni Nani
TDP Mac Assembly
AP Assembly Session
YSRCP