మహేశ్ మూవీ కోసం భారీ సెట్లు వేయిస్తున్న త్రివిక్రమ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ మూవీ కోసం భారీ సెట్లు వేయిస్తున్న త్రివిక్రమ్!

Huge sets for Trivikram movie
  • త్రివిక్రమ్ మూవీకి సన్నాహాలు
  • మహేశ్ బాబుతో మూడో సినిమా
  • టైటిల్ గా వినిపిస్తున్న 'పార్థు'
కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూనే, ఆల్రెడీ తనతో పనిచేసిన స్టార్ డైరెక్టర్లకు కూడా మహేశ్ బాబు ఛాన్స్ ఇస్తూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్న మహేశ్ బాబు, ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ఈ రెండు సినిమాలకి మంచి రేటింగ్ వస్తుండటం విశేషం.

ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మూడో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కథ ఏదైనా అది కుటుంబాలు .. బంధాలు చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఆయన సెట్స్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. మహేశ్ మూవీ కోసం కూడా ఆయన భారీ సెట్లు వేయించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన డిజైన్స్ ను పరిశీలిస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu
Trivikram Srinivas
Pooja Hegde

More Telugu News