ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొత్త సినిమా టైటిల్ ప్రకటన?
- ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'
- తదుపరి చిత్రం కొరటాల శివతో
- టైటిల్ పోస్టర్ రానుందనే టాక్
- త్వరలో షూటింగ్ మొదలు
ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ లుక్ పై కూడా ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. అందువలన ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశాలు లేకపోలేదు అనే టాక్ వినిపిస్తోంది. దాంతో అభిమానులు మరింత ఆసక్తితో ఉన్నారు. అలా ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారనుంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని పేరు వినిపిస్తోంది. త్వరలోనే షూటింగు మొదలు కానుంది.