విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడడమే బ్లాక్ ఫంగస్ కు కారణం: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
- భారత్ లో బ్లాక్ ఫంగస్ కేసులు
- కంటిచూపుతో పాటు కొన్నిసార్లు ప్రాణాలు పోతున్న వైనం
- వివరణ ఇచ్చిన డాక్టర్ గులేరియా
- స్టెరాయిడ్ల దుర్వినియోగం నిలిపివేయాలని స్పష్టీకరణ
కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ తీవ్రం కావడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా స్టెరాయిడ్లు వాడడమేనని అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా స్టెరాయిడ్లు వినిగియోస్తుండడం బ్లాక్ ఫంగస్ ఉద్ధృతికి దోహదపడుతోందని వివరించారు. మధుమేహంతో బాధపడుతున్నవారిలో, కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఈ ఫంగస్ తీవ్ర లక్షణాలు కలుగుజేస్తోందని తెలిపారు. దీన్ని నివారించాలంటే చికిత్సలో స్టెరాయిడ్ల దుర్వినియోగాన్ని నిలిపివేయాలని డాక్టర్ గులేరియా స్పష్టం చేశారు.