'తౌతే' అంటే ఏమిటో తెలుసా..?
- అరేబియా సముద్రంలో 'తౌతే' తుపాను
- గుజరాత్ దిశగా కదులుతున్న తుపాను
- తుపానుకు నామకరణం చేసిన మయన్మార్
- 'తౌతే' అంటే బర్మా భాషలో గోల చేసే బల్లి అని అర్థం
ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఆయా దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది. ఈ నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (డబ్ల్యూఎంఓ/ఈఎస్ సీఏపీ), పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (పీటీసీ) సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏనీ, యెమెన్ దేశాలున్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుపానులకు నామకరణం చేసే విధానం అమలు చేస్తున్నారు.