పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన తుది విడత పోలింగ్
- మొత్తం 35 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
- బరిలో 283 మంది అభ్యర్థులు
- 753 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 753 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్రాల వద్ద బారులు తీరారు.